హోల్ నంబర్ 14..
అన్ని గోల్ఫ్ కోర్సులు ఒక ఎత్తు.. అమెరికాలోని ఇడాహోలో ఉన్న లేక్ కొయిర్ డిఅలెనె గోల్ఫ్ కోర్సు ఒక ఎత్తు. ఈ గోల్ఫ్ కోర్సులో మొత్తం 18 హోల్స్ ఉన్నాయి. అయితే.. 14వ దాన్లోకి బాల్ కొట్టాలంటే.. కొంచెం కష్టమైన పనే.. తేడా వస్తే.. మరి గోల్ఫ్ బాల్ మీ కంటికి కనిపించదు. బుడుంగుమని మునిగిపోతుంది. ఒకవేళ సరిగ్గా కొట్టినా.. దాని వద్దకు పోవాలంటే.. బోటు ఎక్కాల్సిందే. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే గోల్ఫ్ కోర్స్. ఓ సరస్సుపై దీన్ని నిర్మించారు. అంతేకాదు.. ఇది కదులుతుంది కూడా.. ఆటను బట్టి దీని దూరాన్ని సరిచేసుకోవచ్చు. ఈ గోల్ఫ్ కోర్సులో 14వ హోల్ ఉన్న దాన్ని నీటిపై తేలియాడే విధంగా కట్టారు. ఇది అండర్ వాటర్ కేబుల్ ద్వారా కదులుతుంది. కంప్యూటర్ ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.