స్క్రీన్‌ టెస్ట్‌ | Actor Pradeep Rawat made her debut in sye with Telugu cinema | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Oct 10 2017 1:53 AM | Last Updated on Tue, Oct 10 2017 5:04 AM

Actor Pradeep Rawat made her debut in sye with Telugu cinema

► నటుడు ప్రదీప్‌ రావత్‌ ఏ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు?
ఎ) ఛత్రపతి   బి) అందరివాడుసి  ) సై   డి) భద్ర

► దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ‘పెళ్లి చూపులు’ సినిమా తీయకముందు షార్ట్‌ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. ఏ షార్ట్‌ఫిల్మ్‌ అతనికి మంచి పేరు తెచ్చిందో తెలుసా?
ఎ) సైన్మా  బి) అతిథి   సి) లోకల్‌ బోయ్‌   డి) రైతుబిడ్డ

► భానుమతిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి.
ఎ) కమలాకర కామేశ్వరరావు   బి) సి.పుల్లయ్య   సి) పి. పుల్లయ్య   డి) ఆదుర్తి సుబ్బారావు

► హీరో శర్వానంద్‌ సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్‌ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేశారు. ఆ యాడ్‌లో ఓ టాప్‌ హీరో నటించారు. ఆ నటుడెవరో ఊహించండి?
ఎ) చిరంజీవి  బి) నాగార్జున  సి) వెంకటేశ్‌  డి) మోహన్‌లాల్‌

► ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎక్కువమంది ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ ఉన్నది ఈ నటుని ఖాతాలోనే.. ఆయనెవరు?
ఎ) అక్షయ్‌ కుమార్‌ బి) అమితాబ్‌ బచ్చన్‌  సి) సల్మాన్‌ఖాన్‌  డి) ఆమిర్‌ఖాన్‌

► తన ఆరేళ్ల వయసులో..ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట పాడారు. ఇప్పుడు ఆమె హీరోయిన్‌ కూడా. ఎవరో కనిపెట్టారా?
ఎ) ‘కలర్స్‌’ స్వాతి బి) శ్రుతీహాసన్‌ సి) అమలాపాల్‌ డి) మమతా మోహన్‌దాస్‌

► మొట్టమొదట కలర్‌లో (గేవా) పూర్తి నిడివితో వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?
ఎ) లవకుశ   బి) ఆరాధనసి) అ  మరశిల్పి   జక్కన్న   డి) పాతాళ భైరవి

► పుణ్యమూర్తులఅప్పలరాజు ఈయన అసలు పేరు. తెర పేరేంటో తెలుసా?
ఎ) పద్మనాభం   బి) రేలంగి   సి) రాజనాల   డి) రాజబాబు

► ‘ 7/జి బృందావన్‌ కాలనీ’ కన్నడ రీమేక్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌? ఆమె ఎవరో కనుక్కోండి?
ఎ) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌   బి) తమన్నా   సి) రాశీఖన్నా   డి) రెజీనా

► దీపావళి సినిమాలో‘నరకాసురుడు’ పాత్రను పోషించిన నటుడు గుర్తున్నారా?
ఎ) యస్‌.వి. రంగారావు  బి) కాంతారావు  సి) చిత్తూరు నాగయ్య   డి) కొంగర జగ్గయ్య

► తన మూడవ ఏట నుండే సంగీత శిక్షణ తీసుకున్న ఈ గాయని, తరువాతి కాలంలో గొప్ప పేరు సంపాదించారు. ఈమెను ‘నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌’అని కూడా అంటారు.. ఆ నైటింగేల్‌ ఎవరో  చెప్పుకోండి చూద్దాం.
ఎ) యస్‌.జానకి    బి) పి.సుశీలసి) జమునారాణి   డి) రావు బాలసరస్వతి

► రజనీకాంత్‌మాతృభాష ఏది?
ఎ) కన్నడ  బి) మలయాళం  సి) తమిళ్‌   డి) మరాఠీ

► సీనియర్‌ యన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం?
ఎ) యుగంధర్‌    బి) బొబ్బిలిపులి   సి) రాముడు–భీముడు   డి) కథానాయకుడు

► అలనాటి హాట్‌ డాన్సర్స్‌ జయమాలిని, జ్యోతిలక్ష్మిలకు  బంధుత్వం ఉంది? వీళ్లు ఏమవుతారు?
ఎ) అక్కాచెల్లెళ్లు  బి) వదినా మరదలు    సి) పిన్ని, కూతురు    డి) తోడికోడళ్లు

► కృష్ణవంశీ–చిరంజీవి కాంబినేషన్‌లో అప్పట్లో ఒక సినిమా అనుకొని, దానికి పేరు కూడా పెట్టారు?ఆ సినిమా పేరేంటో తెలుసా?
ఎ) జనగణమన   బి) వందేమాతరం   సి) స్వాతంత్య్ర భారతదేశం   డి) సమరయోధుడు

► ‘మంచితనం అనేది చెప్పటానికి, వినటానికి తప్ప బతకటానికి పనిచేయదు’ అని నాగచైతన్య చెప్పిన డైలాగ్‌ ఏ సినిమాలోనిది?
ఎ) ఆటోనగర్‌ సూర్య  బి) దోచెయ్‌    సి) దడ     డి) మనం

► జయలలిత, ఎస్‌. వరలక్ష్మి నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) వింత కుటుంబం    బి) విచిత్ర కుటుంబం    సి) బంగారు కుటుంబం   డి) ఆదర్శకుటుంబం

► ఏ తెలుగు సినిమాలో సంజయ్‌దత్‌ గెస్ట్‌రోల్‌లో చేశారు? (చిన్న క్లూ– ఈ సినిమాలో నాగార్జున హీరో)
ఎ) నిన్నే పెళ్లాడతా  బి) రక్షకుడు    సి) చంద్రలేఖ  డి) హలోబ్రదర్స్‌

► ఈ ఫొటోలో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి గుర్తుపట్టారా?
ఎ) బాలకృష్ణ  బి) జూ. ఎన్టీఆర్‌       సి) కల్యాణ్‌రామ్‌    డి) హరికృష్ణ

► జూ. ఎన్టీఆర్‌ నటించిన ‘అశోక్‌’ సినిమా కెమెరామేన్‌ ఎవరు?
ఎ) పి.సి.శ్రీరామ్‌  బి) కె.కె. సెంథిల్‌ కుమార్‌    సి) ఛోటా కె. నాయుడు     డి) శ్యామ్‌ కె.నాయుడు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...  మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు :
1) సి  2) ఎ  3) బి  4) ఎ 5) బి  6) బి  7) ఎ  8) డి 9) ఎ 10) ఎ  
11) ఎ  12) డి 13) సి  14) ఎ 15) బి 16) బి 17) డి 18) సి 19) డి  20) బి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement