
అసూయతో రగిలిపోతా!
‘‘అసూయ, ద్వేషం లాంటివేవీ మాకు లేవని కొంతమంది అంటుంటారు. కానీ, అవి ఉంటేనే మనం పరిపూర్ణమైన మనుషులమవుతాం అని నా అభిప్రాయం. ఇతర తారల్లో ఎవరైనా మంచి ఫిజిక్ మెయిన్‌టైన్ చేసినా, బాగా నటించినా నాకు అసూయ కలుగుతుంది. ఆ తారల కన్నా నా శరీరాకృతి బాగుండాలనీ, నటనపరంగా విజృంభించాలనీ అనుకుంటాను. అసూయతో రగిలిపోతాను. అదే నన్ను హార్డ్ వర్క్ చేసేలా చేస్తోంది. నా అసూయ వృత్తిపరమైనదే. అంతేగానీ, నాకు వ్యక్తిగతంగా ఎవరి పైనా అసూయా ద్వేషాలు ఉండవు. ఇప్పుడు హిందీ రంగంలో సినిమాకో కొత్త నాయిక పరిచయమవుతున్నారు. దాంతో, పోటీ బలంగా ఉంది. ఇలాంటి బలమైన పోటీని తట్టుకుని నటిగా నిలబడాలంటే అసూయను ఆయుధంగా చేసుకోవాలి. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి సుమా. నా మాటలతో ఎవరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. అంతే.’’
అలియా భట్