నాకంత రంగు పిచ్చి లేదు | Deepika Padukone on skin lightening rumours | Sakshi
Sakshi News home page

నాకంత రంగు పిచ్చి లేదు

Published Sun, Apr 2 2017 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నాకంత రంగు పిచ్చి లేదు - Sakshi

నాకంత రంగు పిచ్చి లేదు

‘‘నా గురించి అలాంటి అవాకులు చెవాకులు పేలితే రంగు పడుద్ది’’ అంటున్నారు దీపికా పదుకొనె. ఇంతకీ ఈ బ్యూటీకి అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. ఈవిడగారి గురించి ప్రచారమైన వార్తల్లో స్కిన్‌ రంగు మార్చుకోవడానికి ‘స్కిన్‌ వైట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌’ తీసుకున్నారన్న వార్త ఒకటి. ‘‘నా గురించి వచ్చిన పచ్చి అబద్ధమైన వార్తల్లో ఇదొకటి’’ అన్నారు దీపిక. చామన ఛాయతో ఉన్నప్పటికీ ఆమె అందంగా ఉంటారు. మేని ఛాయ గురించి దీపిక మాట్లాడుతూ – ‘‘రంగుకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంటే నాకసహ్యం. మన ఒంటి రంగుని మనం డిసైడ్‌ చేయలేం. కానీ, మనసు రంగుని మాత్రం డిసైడ్‌ చేసుకోగలం.

తెల్లని కాగితంలా మనసు ఉండాలి. అంతేకానీ, పైకి తెల్లగా లోపల నల్లగా ఉంటే ఏం బాగుంటుంది? ఒకవేళ నేను నల్లగా ఉన్నా కూడా తెల్లబడటానికి ట్రీట్‌మెంట్‌ తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే నాకంత రంగు పిచ్చి లేదు’’ అన్నారు. చనిపోయే ముందు మీరెలా ఉండాలనుకుంటున్నారు? అనే ప్రశ్న దీపిక ముందుంచితే – ‘‘గంపెడు పిల్లలను కనాలన్నది నా కోరిక. అంతమంది పిల్లల తల్లిగా చనిపోవాలనుకుంటున్నా’’ అన్నారు. ఈ సమాధానం విన్న బాలీవుడ్‌వాళ్లు  ‘అమ్మా.. దీపికమ్మా... అసలే జనాభా సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బెటరమ్మా’ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement