ఆమె ఆ చిత్రానికి నిర్మాత కూడానా? | heroien nayanthara acting in the movie aram | Sakshi
Sakshi News home page

ఆమె ఆ చిత్రానికి నిర్మాత కూడానా?

Published Tue, Aug 15 2017 5:44 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

ఆమె ఆ చిత్రానికి నిర్మాత కూడానా?

ఆమె ఆ చిత్రానికి నిర్మాత కూడానా?

చెన్నై: హీరోయిన్‌ నయనతార తన పాలసీ మార్చుకుందా ?  ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ నీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నయనతార అంగీకరించిన చిత్రాలలో నటించడం వరకే తన పని అంటోందట.  ప్రమోషన్‌ ఇతర అంశాలతో సంబంధం లేదని అగ్రిమెంట్‌లోనే పేర్కొంటోందట.  ఈ విధమైన నిబంధనను ఆమె విధానంగా పెట్టుకుని చాలా కాలం అయింది.

రాజారాణి చిత్రం తరువాత ఏ చిత్ర ప్రచార కార్యక్రమాలలోనూ ఆమె పాల్గొనలేదు. తాజాగా అరం చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం చర్చకు దారి తీసింది. హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలలో అరం ఒకటి. ఇందులో ఆమె కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ గోపి నయినార్‌. ఇంతకు ముందు విజయ్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన కత్తి చిత్రం కథ తనదని కోర్టుకెక్కిన మింజూర్‌ గోపినే గోపి నయినార్‌గా పేరు మార్చుకున్నారు.

ఆయన అరం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి జె. రాజేశ్‌ నిర్మాత. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక టీవీ ఛానల్‌లో అరం చిత్ర ప్రచార కార్యక్రమం‍లో నయనతార పాల్గొన్నారు. ఆమె చిత్రం కోసం అంతగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కారణ ఏమిటంటే, ఈ చిత్ర నిర్మాత జె. రాజేశ్‌ తన మేనేజర్‌ కావడమే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. మరో వర్గం అరం చిత్రానికి నిర్మాత నయనతారేనని, పేరుకు మాత్రమే జె. రాజేశ్‌ అని అంటున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement