ఐ డోంట్ లైక్! | I don' t like boys, says Kate upton | Sakshi
Sakshi News home page

ఐ డోంట్ లైక్!

Published Fri, Jan 2 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

ఐ డోంట్ లైక్!

ఐ డోంట్ లైక్!

క్లబ్‌లు, పబ్బుల్లో కాలక్షేపం చేసే స్వీట్ మోడల్ కేట్ అప్టన్‌కు మందు కొట్టే మగాళ్లంటే అస్సలు గిట్టదంట! వినడానికి వింతగా ఉన్నా... ఈ అమ్మడు మాత్రం సీరియస్‌గానే తన మనసులో మాట బయటపెట్టింది. ‘గడసరి, దురుసుగా ప్రవర్తించే మగాళ్లు నాకు నచ్చరు. మద్యం సేవించిన తరువాత సాధారణంగా వారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో వాళ్లేం చేస్తుంటారో వాళ్లకే అర్థం కాదు. అందుకే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటా’ అంటూ చెప్పుకొచ్చిందీ ఇరవై రెండేళ్ల హాట్ మోడల్. ప్రస్తుతం బేస్‌బాల్ స్టార్ జస్టిన్ వర్లాండర్‌తో డేటింగ్ చేస్తున్న అమ్మడికి... కట్ అయిన రిలేషన్‌ను మళ్లీ కొనసాగించడంపై అసలు నమ్మకం లేదట! అది వేస్ట్ ఆఫ్ టైమ్ అంటోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement