పందెం దేని కోసం? | Kaai Raja Kaai Platinum Disc Function | Sakshi
Sakshi News home page

పందెం దేని కోసం?

Published Mon, Apr 20 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

పందెం దేని కోసం?

పందెం దేని కోసం?

 ఒక పందెం జీవితాలను మారుస్తుంది...అలాగే తలకిందులు కూడా చేస్తుంది. మరి ఎవరు ఎవరి మీద పందెం కాశారు....? దేని కోసం...? ఇదంతా తెలియాలంటే ‘కాయ్ రాజా కాయ్’ చిత్రం చూడాల్సిందే. మానస్, రామ్ ఖన్నా ముఖ్యతారలుగా నటించిన సినిమా ‘కాయ్ రాజా కాయ్’. మారుతీ టాకీస్, ఫుల్ మూన్ ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి  శివగణేశ్ దర్శకుడు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైద రాబాద్‌లో జరిగింది.
 
 ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ ‘‘స్టార్స్‌తో సినిమా తీసి విజయం సాధించడం కన్నా స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి విజయం సాధించడం చాలా గొప్ప విషయం . చిన్న బడ్జెట్ సినిమా అయినా ఇది విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.  దర్శకుడు చాలా బాగా తీశారని ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత మారుతి చెప్పారు.  ఈ చిత్రానికి సంగీతం: జె.బి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీనివాస్ అడ్డాల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement