అండగా సాయి ఉండగా...
సాయిబాబా భక్తులు చెప్పిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సారథ్యంలో స్వీయదర్శకత్వంలో శ్రీనివాస్ జీఎల్బీ నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ మినహా పూర్తయ్యింది. పోలూర్ ఘటికాచలం స్వరసారథ్యంలో కారుణ్య పాడగా ‘అండగా సాయిగా ఉండగా... భయమెందుకు నీకు దండగ..’ పాటను రికార్డ్ చేశారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో ఐదు పాటలు, మూడు శ్లోకాలు ఉన్నాయి. త్వరలో వీటి చిత్రీకరణ మొదలుపెడతాం. బాబా మహిమలు తెలిపే చిత్రాలు చాలా వచ్చాయి. కానీ, స్వయంగా బాబా భక్తుల అనుభవాలతో రూపొందుతున్న చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: లక్ష్మీచంద్ర, సహనిర్మాత: పి. భవానీ అర్జున్‌రావు, శత్రుఘు్నడు కొత్తూరి.