saye daivam
-
బాబా భక్తుల అనుభవాలతో...
విజయచందర్ సాయిబాబాగా నటించిన తాజా చిత్రం ‘సాయే దైవం’. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ, పొనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి నిర్మించారు. ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని విజయచందర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ‘‘30 ఏళ్ల క్రితం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’లో సాయిబాబా పాత్ర చేశా. మళ్లీ ఆ పాత్ర చేసే చాన్స్ రావడం నా అదృష్టం’’ అని విజయచందర్ అన్నారు. -
అండగా సాయి ఉండగా...
సాయిబాబా భక్తులు చెప్పిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సారథ్యంలో స్వీయదర్శకత్వంలో శ్రీనివాస్ జీఎల్బీ నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ మినహా పూర్తయ్యింది. పోలూర్ ఘటికాచలం స్వరసారథ్యంలో కారుణ్య పాడగా ‘అండగా సాయిగా ఉండగా... భయమెందుకు నీకు దండగ..’ పాటను రికార్డ్ చేశారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో ఐదు పాటలు, మూడు శ్లోకాలు ఉన్నాయి. త్వరలో వీటి చిత్రీకరణ మొదలుపెడతాం. బాబా మహిమలు తెలిపే చిత్రాలు చాలా వచ్చాయి. కానీ, స్వయంగా బాబా భక్తుల అనుభవాలతో రూపొందుతున్న చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: లక్ష్మీచంద్ర, సహనిర్మాత: పి. భవానీ అర్జున్‌రావు, శత్రుఘు్నడు కొత్తూరి.