బాలీవుడ్‌ భామ ఇంటరెస్టింగ్‌ లుక్స్‌ | New posters from ShraddhaKapoor's upcoming film #HaseenaParker are out and we think they are really intriguing | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ భామ ఇంటరెస్టింగ్‌ లుక్స్‌

Published Fri, Jul 14 2017 5:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

బాలీవుడ్‌ భామ ఇంటరెస్టింగ్‌ లుక్స్‌

బాలీవుడ్‌ భామ ఇంటరెస్టింగ్‌ లుక్స్‌

సున్‌ రహా  హై నా తూ.. అంటూ  ఆషికీ -2 సినిమాలో అద్భుతమైన పెర్‌ఫామెన్స్‌ తో ఆకట్టుకున్న బాలీవుడ్‌ భామ ఇక ఇపుడు  లేడి డాన్ గా మరింత  అలరించనుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.  అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్ లో రూపొందుతున్న మూవీ   హ‌సీనా పార్క‌ర్. హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి' మూవీలో  శ్రధ్దా కపూర్‌ లేడి డాన్‌గా  న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే.  తాజాగా రిలీజయిన ఈ చిత్రం కొత్త పోస్టర్లలో  శ్రద్ధ లుక్స్‌ ఇంటరెస్టింగ్‌గా ఉన్నాయి.

బాలీవుడ్‌ హీరోయిన్‌  శ్రద్ధాకపూర్  రాబోయే చిత్రం హసీనాపార్కర్  కొత్త పోస్టర్లు బయటకు వచ్చాయి. లేడీ డాన్‌లా భయపెట్టకుండా.. అమాయకంగా.. నిష్కల్మషంగా ఉన్న శ్రద్ధ పోస్టర్లను రిలీజ్‌ చేసి  సినిమాపై మరింత  ఆసక్తిని క్రియేట్‌ చేసింది చిత్ర  యూనిట్‌    ‘ఇప్పటికే రిలీజైన  ఫస్ట్‌ లుక్‌, మూవీ టీజ‌ర్ , ట్రైలర్‌ కూడా బాగా ఆకట్టుకుంది.

కాగా అపూర్వ ల‌ఖియా  ఫిలింస్‌,  నాహిద్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌లో ఈ మూవీ ఆగ‌స్ట్ 18న  థియేటర్లను పలకరించేందుకు  సిద్ధమవుతోంది.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement