RRR Trailer Launch Date & Jr NTR, Ram Charan Poster Released From RRR Movie - Sakshi
Sakshi News home page

RRR Update: అదిరిపోయిన ఎన్టీఆర్‌, రామ్‌ పోస్టర్లు.. అమెరికాలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డు !

Published Tue, Dec 7 2021 7:56 AM | Last Updated on Tue, Dec 7 2021 8:56 AM

Ntr And Ram Charan New Look Posters Out From RRR - Sakshi

Ntr And Ram Charan New Look Posters Out From RRR: దర్శకధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది యంగ్‌ టైగర్‌ జూ. ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే. ఆ సినిమాకు అంచనాలు అంతకుమించి అన్నట్లుగా ఉంటాయి. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై సినిమాకు బడ్జెట్‌కు మించిన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్‌ గట్టిగా నమ్ముతోంది. ఈ నెల 9న ట్రైలర్‌ రాబోతుంది. ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. 

ఈ సినిమా విడుదల కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఒక్క అమెరికాలోనే వెయ్యికిపైగా మల్టీ ప‍్లెక్సులు బ్లాక్‌ చేశారని సమాచారం. అగ్రరాజ్యంలో ఓ భారతీయ సినిమా ఈ స్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆ రకంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం రికార్డు క్రియేట్‌ చేయబోతోందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అభిమానుల్లో జోష్ నిపండానికి సోమవారం (డిసెంబర్‌ 6) రెండు సర్‌ప్రైజ్‌లు ఉందించింది చిత్రబృందం. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ సినిమా సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. 

ఇదీ చదవండి: చెల్లెలితో కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లిన రామ్‌చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement