భారత్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా | Antibiotic resistant ‘superbug’ found at Aligarh medical college | Sakshi
Sakshi News home page

భారత్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా

Published Thu, Sep 4 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

Antibiotic resistant ‘superbug’ found at Aligarh medical college

అలీగఢ్: ప్రభావవంతమైన ఔషధాలకు కూడా నిరోధకత కలిగిన.. ప్రమాదకరమైన ‘ఎన్‌డీఎం-4’ రకం బ్యాక్టీరియాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో గుర్తించారు. ఈ-కొలి తరహాకు చెందిన వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పటివరకూ కామెరూన్, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో మాత్రమే కనిపించింది. భారత్‌లో దీనిని గుర్తించడం ఇదే మొదటిసారని వర్సిటీ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త అసద్ ఉల్లాఖాన్ తెలిపారు. 2009లో ఇదే తరహాకు చెందిన ‘ఎన్‌డీఎం-1’ రకం బ్యాక్టీరియాను గుర్తించామన్నారు. కానీ అంతకన్నా ప్రమాదకరమైన ఈ ‘ఎన్‌డీఎం-4’.. అలీగఢ్‌లోని మెడికల్ కాలేజీలో మురుగునీటిని విశ్లేషిస్తుండగా బయటపడిందని చెప్పారు.

Advertisement
Advertisement