క్లోరిన్ గ్యాస్ లీకేజీ:19 మందికి అస్వస్థత
Published Fri, Apr 14 2017 2:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
వడోదర: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 19 మంది కార్మికులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. వడోదర జిల్లా కేంద్రం సమీపంలోని పోర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వాటర్ ట్యాంక్‌లోని గురువారం రాత్రి క్లోరిన్ గ్యాస్‌ను పంపిస్తున్న క్రమంలో అది లీకయింది. దానిని పీల్చిన పారిశుధ్య సిబ్బంది 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కళ్లు, గొంతు మంటతో ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే వడోదరలోని శాయాజీరావు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న క్లోరిన్ గ్యాస్ కంపెనీ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్యాస్ సిలిండర్‌ను నిర్వీర్యం చేసి పక్కనే ఉన్న ధాదర్ నదిలో పడేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
Advertisement