chlorine gas leakage
-
జనగామలో క్లోరిన్ గ్యాస్ లీక్
-
విషవాయువు లీక్.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత
విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. క్లోరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. At least 10 people have died and more than 250 injured after a toxic gas leak at Aqaba Port in Jordan. pic.twitter.com/kjTDaPkelw — Suzanne (@suzanneb315) June 27, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 24 మందికి అస్వస్థత
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో చిన్నారులు, పోలీసులు సహా మొత్తం 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నగరంలోని జల సంస్థాన్ మంచినీటి శుద్ధీకరణ కేంద్రంలో గురువారం రాత్రి క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రభావానికి లోనయ్యారు. ఆక్సిజన్ కొరత: క్లోరిన్ వాయువును పీల్చి అస్వస్థతకు గురైనవారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆక్సిజన్ కొరత ఉండటంతో బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీఎం ట్వీట్: గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ లీకేజీ లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నానని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
క్లోరిన్ గ్యాస్ లీకేజీ:19 మందికి అస్వస్థత
వడోదర: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 19 మంది కార్మికులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. వడోదర జిల్లా కేంద్రం సమీపంలోని పోర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వాటర్ ట్యాంక్‌లోని గురువారం రాత్రి క్లోరిన్ గ్యాస్‌ను పంపిస్తున్న క్రమంలో అది లీకయింది. దానిని పీల్చిన పారిశుధ్య సిబ్బంది 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళ్లు, గొంతు మంటతో ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే వడోదరలోని శాయాజీరావు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న క్లోరిన్ గ్యాస్ కంపెనీ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్యాస్ సిలిండర్‌ను నిర్వీర్యం చేసి పక్కనే ఉన్న ధాదర్ నదిలో పడేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.