ఇదొక వింత విషాదం..! | Elderly couple dies as husband gets crushed under 128kg wife | Sakshi
Sakshi News home page

ఇదొక వింత విషాదం..!

Published Tue, Jul 5 2016 8:55 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

ఇదొక వింత విషాదం..! - Sakshi

ఇదొక వింత విషాదం..!

రాజ్ కోట్: ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన.. కానీ విషాదాన్ని నింపింది. భారీ కాయం ఉన్న గృహిణి తన భర్తపై కాలు జారి పడటంతో తలకు బలమైన గాయాలై భార్య, భర్త ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొడుక్కి శ్వాస సంబంధమైన ఇబ్బంది తలెత్తిందని కంగారుతో చూసేందుకు మెట్లెక్కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్ రాజ్ కోట్ లోని కలావడ్ రోడ్డులోగల రామ్ దామ్ సొసైటీలో మంజుల విఠలానీ(68), నట్వర్ లాల్ అనే భార్యభర్తలు ఉంటున్నారు.

భార్య మంజుల 128 కేజీల బరువు ఉంటుంది. వీరి కుమారుడు ఆశిష్, కోడలు నిశా  పై ఫ్లోర్ లో ఉంటున్నారు. సరిగ్గా తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ఆశిష్ కు శ్వాస సంబంధమైన ఇబ్బంది వచ్చిందని దానికి సంబంధించిన మందులు తీసుకెళ్లేందుకు నిశా కిందికి వచ్చింది. అదే సమయంలో అత్తమామలైన మంజుల, నట్వర్ లాల్ కూడా మేల్కొన్నారు. కొడుకుకు ఏమైందోనన్న కంగారుతో చూద్దామని మంజుల, ఆమె భర్త మెట్లెక్కి పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మంజుల తన బరువును ఆపుకోలేక కాలుజారి వెనుక వస్తున్న భర్తపై పడింది. ఆమె అధిక బరువు ఉండటంతో ఇద్దరి తలకు బలమైన గాయాలయి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement