‘లష్కరే’కు నేనే డబ్బులిచ్చా | Headley testimony | Sakshi
Sakshi News home page

‘లష్కరే’కు నేనే డబ్బులిచ్చా

Published Thu, Mar 24 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

‘లష్కరే’కు నేనే డబ్బులిచ్చా

‘లష్కరే’కు నేనే డబ్బులిచ్చా

హెడ్లీ వాంగ్మూలం
 
 ముంబై: లష్కరే తోయిబా నుంచి తనకు నిధులు అందలేదని.. తానే ఆ సంస్థకు నిధులు సమకూర్చానని ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తెలిపారు. హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు బుధవారం విచారించింది. కీలక నిందితుడు అబూ జుందాల్ న్యాయవాది అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో జస్టిస్ జి.ఎ. సనాప్.. హెడ్లీని విచారించారు. విచారణలో ముంబై క్రైమ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్నారు. లష్కరే నుంచి తనకు నిధులు అందాయన డాన్ని హెడ్లీ ఖండించాడు.

పైగా తానే 2006 వరకు లష్కరేకి 60 నుంచి 70 లక్షల వరకు పాక్ రూపాయల్ని విరాళంగా ఇచ్చానన్నాడు. ఆ డబ్బులు ఇచ్చింది ఏ ఆపరేషన్ కోసమూ కాదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ (డీఈఏ)  ఒకసారి తాను పాక్ వెళ్లడానికి ఆర్థిక సాయం చేసిందని చెప్పాడు తెలిపాడు. లష్కరే ఉగ్రవాది తహావుర్ రానాతో తనకు పరిచయం ఉందని వెల్లడించాడు. ముంబై దాడుల సందర్భంగా ఆయన ఆఫీసును వాడుకున్నట్లు తెలిపాడు.   తాను అరేబియా, పాకిస్తాన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు హెడ్లీ పేర్కొన్నాడు. పాక్‌కు చెందిన తన భార్య షాజియా గిలానీకి సంబంధించిన  సమాచారాన్ని వెల్లడించేందుకు హెడ్లీ నిరాకరించాడు. పాక్‌కే చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్స్ వ్యాపారానికి సహకరించాడని, అతనితో కలసి 2006లో భారత్‌లో అక్రమ ఆయుధ వ్యాపారానికి తెరతీసినట్లు వెల్లడించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement