హెడ్లీ వివరాలు చెప్పేందుకు భార్య నిరాకరణ
న్యూఢిల్లీ: ఎన్‌ఐఎ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ భార్య షాజియా, అతని వ్యాపార భాగస్వామి రేమండ్ శాండర్స్‌లు నిరాకరించారు. వ్యక్తిగత స్వేచ్ఛ సాకుతో సమాధానాలిచ్చేందుకు ఒప్పుకోలేదని అధికారులు తెలిపారు. హెడ్లీకి సంబంధించిన వివరాలు సేకరించేందుకు అమెరికా న్యాయశాఖ సాయంతో ఎన్‌ఐఏ ఈ ప్రయత్నం చేసింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం కేసులో నిందితుడిగా ఉన్నా... విచారణను తిరస్కరించవచ్చు. హెడ్లీ భార్య, స్నేహితుడ్ని ప్రశ్నించడంతో అతని కుటుంబ వివరాలు, భారత్‌లో కార్యకలాపాలు, లష్కరేతోయిబాతో సంబంధాలు తెలుస్తాయని ఎన్‌ఐఏ ఆశించింది.