పల్లెటూరి అమ్మాయిని.. ర్యాంకెలా వచ్చిందో తెలీదు! | i am a village girl, donot know how top rank came, says ruby roy | Sakshi
Sakshi News home page

పల్లెటూరి అమ్మాయిని.. ర్యాంకెలా వచ్చిందో తెలీదు!

Published Mon, Jun 27 2016 12:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

పల్లెటూరి అమ్మాయిని.. ర్యాంకెలా వచ్చిందో తెలీదు!

పల్లెటూరి అమ్మాయిని.. ర్యాంకెలా వచ్చిందో తెలీదు!

తాను పల్లెటూరి అమ్మాయినని, ఏదో ఇంటర్ పాసైతే సరిపోతుందని అనుకున్నానే గానీ.. అసలు టాప్ ర్యాంకు ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని బిహార్ బోర్డు పరీక్షల టాపర్ రుబీ రాయ్ తెలిపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా, కోర్టు 14 రోజుల రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. తన కాలేజి ప్రిన్సిపాల్ బచ్చారాయ్ తమకు దూరపు బంధువని, కానీ ఆయనతో తాను ఎప్పుడూ మాట్లాడలేదని పోలీసులకు విచారణలో వెల్లడించింది. తన తండ్రి మాత్రం ఆయనతో మాట్లాడి ఉండొచ్చని చెప్పింది.

బోర్డు రెండోసారి నిర్వహించిన పరీక్షలలో ఏమీ గుర్తులేవని చెప్పడంతో.. తులసీదాస్ మీద వ్యాసం రాయమంటే ‘తులసీదాస్జీ.. ప్రణామ్’ అన్న ఒకే ఒకే వాక్యం రాసి ఊరుకున్న విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు అమెను అరెస్టు చేసి మహిళా పోలీసు స్టేషన్లో ఉంచి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. టాపర్లుగా వచ్చిన 12 మందిని ఇంటర్వ్యూ చేద్దామన‍్న ఆలోచన టీవీ చానళ్లకు రాకపోయినా.. అక్కడ పాలిటిక్స్ అంటే ఏంటి అని అడగకపోయినా ఈ ర్యాంకుల కుంభకోణం అసలు బయటపడి ఉండేదే కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement