ఇష్టమూ ఉంది... కష్టమూ ఉంది!
రేవతి ఓ పల్లెటూరి అమ్మాయి. అయినా బాగా చదువుకుంటుంది. ఇంజినీరింగ్ పూర్తి చేస్తుంది. కానీ పట్నానికి వెళ్లడానికి మాత్రం ఇష్టపడదు. తన ఊరిని వదిలి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదామెకి. కానీ ఆమె నిర్ణయాన్ని తండ్రి సమర్థించలేకపోతాడు. ఆమె చదువు వృథా కాకూడదని, ఇంకా చదువుకుని జీవితంలో పెకైదగాలని కూతురి కోసం కలలు కంటాడు. ఎలాగో అతి కష్టమ్మీద రేవతిని పై చదువులకు వెళ్లేందుకు ఒప్పిస్తాడు. ఇది ఈమె కథ. ఇక హీరో... గౌతమ్‌కృష్ణ. భారతీయ కట్టుబాట్లు, సంప్రదాయాలను ఇష్టపడని వ్యక్తి. గ్రీన్‌కార్డ్ సంపాదించి అమెరికాలో సెటిలైపోవాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచనే ఉండదతడికి. ఈ ఇద్దరూ ఒకరికొకరు తారసపడితే ఎలా ఉంటుంది? పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వీళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన సీరియల్... కొంచెం ఇష్టం కొంచెం కష్టం.
స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండటంతో సీరియల్‌ని ఇష్టపడినా... అత్యంత పాత కథాంశం కావడంతో ఇష్టపడటానికి కాస్త కష్టపడాల్సి వస్తోంది. హీరోయిన్ చలాకీదనం ఆకట్టుకున్నా, హీరో ఎక్స్‌ప్రెషన్స్‌లోని లోపం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతోంది. కొద్దిపాటి మార్పులు చేస్తే కష్టం తగ్గి ఇష్టం పెరిగే అవకాశం లేకపోలేదు!