నేను గానీ.. నా రోహిత్ గానీ: ఎన్డీ తివారీ
పిథోర్‌గఢ్(ఉత్తరాఖండ్): వచ్చే ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలా? తన కుమారుడు రోహిత్ శేఖర్ పోటీచేయాలా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని కాంగ్రెస్ వృద్ధ నేత ఎన్.డి.తివారీ పేర్కొన్నారు.
రోహిత్ శేఖర్‌ను ఇటీవలే తన కుమారునిగా తివారీ అంగీకరించడం తెలిసిందే. ఆయన తన కుమారునితో కలిసి నైనిటాల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ స్థానం నుంచి ప్రజలు తనను పోటీచేయాలని కోరుకుంటున్నారా? లేదా తన కుమారుడినా? అన్నది తెలుసుకునేందుకే నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు తివారీ శనివారం తెలిపారు.