కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈనెల 22 నుంచి జర్మనీ, లండన్‌లలో పర్యటిస్తారు. ఆయా దేశాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనే రాహుల్ మేథావులు, విద్యార్ధులు, మీడియాతో ముచ్చటించనున్నారు. ఐరోపా, బ్రిటన్‌లలో ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు , విద్యార్థుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ చీఫ్ ఆగస్ట్ 22, 23 తేదీల్లో జర్మనీలో, 24, 25న లండన్‌లో పర్యటిస్తారని ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా ట్వీట్ చేశారు.
ఆర్థిక వ్యవస్థ, ఉపాథి, నోట్ల రద్దు, దేశ భద్రత తదితర అంశాలపై రాహుల్ గాంధీ ప్రసంగాల పట్ల విదేశీయులు, భారత సంతతి ప్రజల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు మన ముందున్న అవకాశాలపై ఈ సందర్భంగా రాహుల్ ఎన్‌ఆర్‌ఐలకు దిశానిర్ధేశం చేస్తారన్నారు. జర్మనీ, లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే రెండు భారీ సమ్మేళనాల్లో రాహుల్ పాల్గొంటారని వెల్లడించారు. గతంలోనూ రాహుల్ ఇదే తరహాలో తొలుత అమెరికా అనంతరం మధ్యప్రాచ్య దేశాలు, సింగపూర, మలేషియాల్లో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment