కదిలే కారులో మహిళపై గ్యాంగ్రేప్ | Woman gangraped in moving car | Sakshi
Sakshi News home page

కదిలే కారులో మహిళపై గ్యాంగ్రేప్

Published Sun, Apr 26 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

కదిలే కారులో మహిళపై గ్యాంగ్రేప్

కదిలే కారులో మహిళపై గ్యాంగ్రేప్

మీరట్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ యువతిని కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

40 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేయడం కోసం నగరానికి వచ్చింది. సంజీవ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.అది సేవించిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కారులో తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఓ కాలువ వద్ద ఆమెను పడేసి వెళ్లారు. పెట్రోలింగ్ సిబ్బంది ఆమెను గమనించి సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement