ఎల్బీ స్టేడియుం: హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియున్‌షిప్ ఈనెల 27, 28వ తేదీల్లో జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియుంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్(హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20 బాల బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ మీట్‌లో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను హైదరాబాద్‌లో వచ్చే నెల 13 నుంచి నిర్వహించనున్న తొలి తెలంగాణ అంతర్ జిల్లా జూని యుర్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. ఓపెన్ స్కూల్స్, జూనియుర్ కాలేజి అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని హెచ్‌డీఏఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజేష్ కువూర్ తెలిపారు. ఆసక్తి గల వారు తవు ఎంట్రీలను ఈ నెల 26లోగా పంపాలని, ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.ఎం. చిష్తీ (99894-33671)ను సంప్రదించాలని తెలిపారు.
24న వన్డే చెస్ కోచ్‌ల టోర్నీ
వన్డే ఓపెన్ ప్రైజ్‌వునీ కోచ్‌ల చెస్ టోర్నమెంట్ ఈనెల 24న రాంనగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో జరగనుంది. ఈ టోర్నీలో అత్యుత్తవు నైపుణ్యం కనబర్చిన కోచ్‌కు టాలెంట్ చెస్ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని చెస్ కోచ్‌లంతా ఈ టోర్నీలో పాల్గొనాలని కోరారు. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు కె. దయూనంద్(96526-17524)ను సంప్రదించవచ్చు.
26 నుంచి కార్గిల్ విక్టరీ క్రీడలు
16వ వార్షిక కార్గిల్ విక్టరీ క్రీడలు ఈనెల 26 నుంచి 28 దాకా నారాయుణగూడలోని వైఎంసీఏలో జరుగుతారుు. కార్గిల్ యుుద్ధంలో భారత వీర జవాన్లు సాధించిన విజయోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలు, యువతలో స్ఫూర్తి నింపేందుకు గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ప్రతీ ఏడాది ఈ క్రీడలను నిర్వహిస్తోంది. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టె న్నిస్, టెన్నిస్, చెస్, కరాటే తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 25లోగా నారాయుణగూడ వైఎంసీఏ సెక్రటరీ లియోనార్డ్ మైరాన్‌ను 27564670 లేదా 27552035 నంబర్లలో సంప్రదించవచ్చు.
27 నుంచి జూనియుర్ అథ్లెటిక్స్ మీట్
Published Wed, Aug 20 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement