Junior Athletics campiyunsip
-
Shaili Singh: సెంటి మీటర్ తేడాతో స్వర్ణం చేజారె!
నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్ దూరం భారత అథ్లెట్ శైలీ సింగ్‌ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్–20) చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచినా... వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్‌ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్ మెగా ఈవెంట్లో లాంగ్‌జంపర్ శైలీ ఆదివారం ఫైనల్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్‌జంప్ ఫైనల్లో స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. (మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా) భారత లాంగ్‌జంపర్ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది. చదవండి: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత మహిళల రిలేలో నాలుగో స్థానం తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు. ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.; ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.; స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది. నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి. జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్ ఈవెంట్లో తలపడే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాకారం చేసుకుంటా’ – శైలీ సింగ్ -
శైలీ 6.40 మీటర్ల జంప్
నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శైలీ సింగ్ సత్తా చాటింది. మహిళల లాంగ్ జంప్‌లో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. శైలీ తన మూడో ప్రయత్నంలో 6.40 మీటర్లు దూకింది. అధికారిక ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 6.35 మీటర్లు కావడంతో ఆమె నేరుగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన శైలీ ప్రతిభను గుర్తించి భారత దిగ్గజం అంజూ బాబీ జార్జ్ ఆమెను తన అకాడమీలో సానబెట్టింది. ప్రస్తుతం శైలి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రంలో శిక్షణ పొందుతోంది. ఆదివారం ఈ భారత అథ్లెట్ ఫైనల్ బరిలోకి దిగనుంది. పురుషుల జావెలిన్ త్రోలో మన జట్టుకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఫైనల్‌కు చేరిన ఆశలు రేపిన భారత త్రోయర్లు అజయ్ రాజ్ సింగ్, జై కుమార్ వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచారు. అజయ్ 73.68 మీటర్లు త్రో విసరగా, జై కుమార్ జావెలిన్ 70.74 మీటర్ల వరకు వెళ్లింది. పురుషుల 300 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సునీల్ జోలియా (9 నిమిషాల 49.23 సెకన్లు) ఓవరాల్‌గా 22వ స్థానంలో, పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే ఓవరాల్‌గా 17వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు. మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ హీట్ 1లో 11వ స్థానానికే పరిమితమై ముందంజ వేయలేకపోయింది. నందిని, శ్రీనివాస్‌లకు నిరాశ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు దురదృష్టవశాత్తూ ముందంజ వేయలేకపోయారు. అగసార నందిని (తెలంగాణ) మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించింది. 14.16 సెకన్లలో పరుగు పూర్తి చేసిన నందిన సెమీస్ (హీట్ 2)లో ఆరో స్థానంతో ముగించింది. అంతకుముందు హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. పురుషుల 200 మీటర్ల పరుగులో నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. 21.33 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన అతను హీట్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
27 నుంచి జూనియుర్ అథ్లెటిక్స్ మీట్
ఎల్బీ స్టేడియుం: హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియున్‌షిప్ ఈనెల 27, 28వ తేదీల్లో జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియుంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్(హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20 బాల బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ మీట్లో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను హైదరాబాద్‌లో వచ్చే నెల 13 నుంచి నిర్వహించనున్న తొలి తెలంగాణ అంతర్ జిల్లా జూని యుర్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. ఓపెన్ స్కూల్స్, జూనియుర్ కాలేజి అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని హెచ్‌డీఏఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజేష్ కువూర్ తెలిపారు. ఆసక్తి గల వారు తవు ఎంట్రీలను ఈ నెల 26లోగా పంపాలని, ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.ఎం. చిష్తీ (99894-33671)ను సంప్రదించాలని తెలిపారు. 24న వన్డే చెస్ కోచ్‌ల టోర్నీ వన్డే ఓపెన్ ప్రైజ్‌వునీ కోచ్‌ల చెస్ టోర్నమెంట్ ఈనెల 24న రాంనగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో జరగనుంది. ఈ టోర్నీలో అత్యుత్తవు నైపుణ్యం కనబర్చిన కోచ్‌కు టాలెంట్ చెస్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని చెస్ కోచ్‌లంతా ఈ టోర్నీలో పాల్గొనాలని కోరారు. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు కె. దయూనంద్(96526-17524)ను సంప్రదించవచ్చు. 26 నుంచి కార్గిల్ విక్టరీ క్రీడలు 16వ వార్షిక కార్గిల్ విక్టరీ క్రీడలు ఈనెల 26 నుంచి 28 దాకా నారాయుణగూడలోని వైఎంసీఏలో జరుగుతారుు. కార్గిల్ యుుద్ధంలో భారత వీర జవాన్లు సాధించిన విజయోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలు, యువతలో స్ఫూర్తి నింపేందుకు గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ప్రతీ ఏడాది ఈ క్రీడలను నిర్వహిస్తోంది. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టె న్నిస్, టెన్నిస్, చెస్, కరాటే తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 25లోగా నారాయుణగూడ వైఎంసీఏ సెక్రటరీ లియోనార్డ్ మైరాన్ను 27564670 లేదా 27552035 నంబర్లలో సంప్రదించవచ్చు.