సాక్షి, హైదరాబాద్ : భారత క్రీడాకారిణి దుతీచంద్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. వచ్చే నెల 4 నుంచి 7 వరకు చైనాలోని వుహాన్‌లో జరిగే ఈ ఈవెంట్ రిలే విభాగంలో దుతీ పాల్గొంటుంది. బెంగళూరులో జరుగుతున్న రిలే ట్రయల్స్ (4్ఠ100 మీ.)లో బుధవారం పాల్గొన్న దుతీ బృందం అర్హతకు కావాల్సిన కనీస టైమింగ్‌ను అందుకుంది. దుతీతో పాటు సిని జోస్, హిమశ్రీ, సబానినన్ సభ్యులుగా ఉన్న ఈ టీమ్ 44.89 సెకన్లలో పరుగు పూర్తి చేసింది.
హైదరాబాద్‌కు చెందిన నాగపురి రమేశ్, దుతీచంద్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలోనే ఉంటూ ఆమె గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల సమయంలో డోపింగ్ వివాదం కారణంగా దుతీపై నిషేధం పడింది. అయితే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో వాదనలు వినిపించిన అనంతరం దుతీకి ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అనుమతి లభించింది.
‘ఆసియా’కు దుతీచంద్ అర్హత
Published Thu, May 28 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement