Pullela Gopichand Academy
-
గోపీచంద్ అకాడమీ లో ఆనందోత్సహాలు
-
పెట్రా స్పోర్ట్స్ అకాడమీ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: స్ప్రింగ్ సాకర్ టోర్నమెంట్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్లు విజేతగా నిలిచాయి. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ఈ టోర్నీలో అండర్–11, అండర్–14 విభాగాల్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్లు గెలుపొందాయి. అండర్–14 విభాగంలో జీఆర్ఎఫ్ఏతో జరిగిన ఫైనల్లో 2–2తో స్కోర్లు సమం కావడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను ప్రకటించారు. పెనాల్టీ షూటౌట్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్టు 3–1తో విజయం సాధించింది. అంతకుముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన సెమీఫైనల్లో కూడా పెట్రా స్పోర్ట్స్ అకాడమీ షూటౌట్ ద్వారానే 3–1తో గెలుపొందింది. అండర్–11 విభాగంలో హైదరాబాద్ హాట్స్పర్స్తో జరిగిన ఫైనల్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ 2–0తో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. అంతకుముందు ఆ జట్టు గచ్చి బౌలి గన్నర్స్‌తో జరిగిన సెమీస్‌లో 1–0తో గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించింది. అండర్–11 విభాగంలో వేద్, వివేక్; అండర్–14 విభాగంలో వరుణ్, సామిక్లు బెస్ట్ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. విజేతలకు బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ బహుమతులు అందజేశారు. -
షట్లర్లకు ‘టాప్’ సాయం
న్యూఢిల్లీ: టార్గెట్ ఓలింపిక్ పోడియం (టాప్) పథకానికి ఎంపికై పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నలుగురు షట్లర్ల సౌకర్యార్థం మంగళవారం కేంద్రం నిధుల్ని విడుదల చేసింది. జిమ్ పరికారాల కోసం రూ. 30 లక్షలు, ఫిజియోథెరపిస్ట్‌కు నెలకు రూ. 40వేలు, ఇతరత్ర ఖర్చుల కోసం నెలకు రూ. 50వేల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) నుంచి ఈ నిధుల్ని విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సౌకర్యాల్ని ఈ నలుగురు ఆటగాళ్లకు మినహా వేరే వ్యక్తులు వాడరాదని తెలిపింది. ఈ పరికరాలపై యాజామన్య హక్కులు భారత క్రీడాప్రాదికార సంస్థ (సాయ్)కు చెందుతాయని వెల్లడించింది. ప్రఖ్యాత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, గురుసాయిదత్ టాప్ పథకానికి ఎంపికై, అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. -
‘ఆసియా’కు దుతీచంద్ అర్హత
సాక్షి, హైదరాబాద్ : భారత క్రీడాకారిణి దుతీచంద్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. వచ్చే నెల 4 నుంచి 7 వరకు చైనాలోని వుహాన్‌లో జరిగే ఈ ఈవెంట్ రిలే విభాగంలో దుతీ పాల్గొంటుంది. బెంగళూరులో జరుగుతున్న రిలే ట్రయల్స్ (4్ఠ100 మీ.)లో బుధవారం పాల్గొన్న దుతీ బృందం అర్హతకు కావాల్సిన కనీస టైమింగ్‌ను అందుకుంది. దుతీతో పాటు సిని జోస్, హిమశ్రీ, సబానినన్ సభ్యులుగా ఉన్న ఈ టీమ్ 44.89 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన నాగపురి రమేశ్, దుతీచంద్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలోనే ఉంటూ ఆమె గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల సమయంలో డోపింగ్ వివాదం కారణంగా దుతీపై నిషేధం పడింది. అయితే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో వాదనలు వినిపించిన అనంతరం దుతీకి ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అనుమతి లభించింది.