
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో హరిణి నరహరి ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. అబిడ్స్‌లోని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యాలయంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో హరిణి అగ్రస్థానంలో నిలిచింది. వి. నందిత, స్నేహా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో అభిరామి (2)పై హరిణి (2), శీతల్ (2)పై నందిత (2), శ్రీశాంతి (2)పై స్నేహ, శాన్వి (1.5)పై రచిత గెలుపొందారు. ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు.
Comments
Please login to add a commentAdd a comment