లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 27–25తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో దీపక్ దహియా (7 పాయింట్లు), సుర్జీత్ సింగ్ (5), వికాస్ (4) రాణించారు. అనంతరం యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 33–33తో టైగా ముగిసింది. నేడు జరిగే ఏకైక మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.