శ్యామ్‌ ఖాతాలో స్వర్ణం | Kakara Shyam Kumar won gold medal | Sakshi
Sakshi News home page

శ్యామ్‌ ఖాతాలో స్వర్ణం

Published Sun, Apr 9 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

శ్యామ్‌ ఖాతాలో స్వర్ణం

శ్యామ్‌ ఖాతాలో స్వర్ణం

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బ్యాంకాక్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 49 కేజీల విభాగం ఫైనల్లో శ్యామ్‌ కుమార్‌కు ‘వాకోవర్‌’ లభించింది.

శ్యామ్‌తో తలపడాల్సిన అతని ప్రత్యర్థి, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ హసన్‌బాయ్‌ దుస్‌మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) గాయం కారణంగా రింగ్‌లోకి అడుగు పెట్టలేదు. దాంతో శ్యామ్‌కు బరిలోకి దిగకుండానే స్వర్ణ పతకం ఖాయమైంది. వైజాగ్‌కు చెందిన శ్యామ్‌ 2015లోనూ ఈ టోర్నీలో పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement