ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ప్రొఫెసర్ జయశంకర్ స్మారక తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌ను ఈనెల 21న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు డి.వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్(టీఎస్‌ఎఫ్) హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(హెచ్‌డీఏఏ)ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను అండర్-18, 16, 14, 12 బాలబాలికల విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పురుషుల,మహిళల విభాగంల్లో 100మీటర్ల, 400మీటర్ల, 1500మీటర్ల పరుగు పందేలను నిర్వహిస్తారు, అండర్-18 బాలబాలికల విభాగాల్లో 100మీ, 400మీ,1200మీ, అండర్-16 బాలబాలికల విభాగాల్లో 100మీ, 400మీ, 1000మీ పరుగు పందేలను నిర్వహిస్తారు. అండర్-14 బాలబాలికల విభాగాల్లో 100మీ, 600మీట్లరతోపాటు లాంగ్‌జంప్‌ను నిర్వహిస్తారు. అండర్-12 బాలబాలికల విభాగాల్లో 100మీ, 400మీటర్లతోపాటు లాంగ్‌జంప్ అంశాల్లో పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను హెచ్‌డీఏఏ ప్రధాన కార్యదర్శి బి.సి.భాస్కర్‌రెడ్డి(98490-48586)ను సంప్రదించాలి. ఇతర వివరాలకు టీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు డి.వినోద్ కుమార్(93926-83224)లను సంప్రదించవచ్చు.
జయశంకర్ స్మారక అథ్లెటిక్ మీట్ 21న
Published Sat, Jun 14 2014 12:23 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement