బరిలో 8 జట్లు
హైదరాబాద్:తొలిసారి తెలంగాణలో కబడ్డీ లీగ్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ’ పేరుతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే ఈ పోటీల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నారుు. దీనికి సంబంధించి జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్‌లతో పాటు బీజేపీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనికి హాజరయ్యారు.
‘అస్లీ అడ్డా ఫర్ అస్లీ కబడ్డీ’ అనే ట్యాగ్‌లైన్‌తో నిర్వహించనున్న ఈ టోర్నీకి హిమబిందురెడ్డికి చెందిన చింతల స్పోర్‌ట్స ప్రైవేట్ లిమిటెడ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ బుల్స్, కరీంనగర్ కింగ్‌స, సిద్దిపేట స్టాలియన్‌స, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైడర్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, నల్గొండ ఈగల్స్ పేరుతో ఎనిమిది జట్లను విభజించారు.