హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెయిర్ స్టో(114; 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(100 నాటౌట్: 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు)లు రెచ్చిపోయి ఆడటంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోరు సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు అత్యుత్తమ స్కోరు.
(ఇక్కడ చదవండి: వార్నర్-బెయిర్ స్టో జోడి సరికొత్త రికార్డు)
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్-బెయిర్ స్టో జోడి 185 పరుగుల తొలి వికెట్ భాగస‍్వామ్యం నెలకొల్పి పటిష్టమైన పునాది వేశారు. బెయిర్ స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, మరో 24 బంతుల్లో సెంచరీ మార్కును చేరాడు. ఇక వార్నర్ 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేయగా, మరో 22 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో కూల్‌గా ఆడిన వార్నర్.. ఆపై చెలరేగిపోయాడు. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి అజేయ శతకంతో నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లో చహల్‌కు మాత్రమే వికెట్ లభించింది.
(ఇక్కడ చదవండి: ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కునిగా..)
Comments
Please login to add a commentAdd a comment