సాక్షి, హైదరాబాద్: యష్ కపాడియా (164 బంతుల్లో 199 నాటౌట్; 33 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన సెంచరీకి తోడు బి. రేవంత్ (84 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం సాధించడంతో అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ మరో విజయం సాధించింది. అండర్-16 కోకాకోలా కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీచైతన్య 221 పరుగుల తేడాతో కేవీ బొల్లారంను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చైతన్య 48 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంతరం కేవీ బొల్లారం 28 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ కుమార్ (46), అంకిత్ కుమార్ (36) ఫర్వాలేదనిపించారు. ఈశ్వరరావు 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
సెయింట్ మేరీస్ జేసీ యూసుఫ్‌గూడ 80 (చందన్ 3/10); వెస్లీ జేసీ 83/0 (శ్రీనాథ్ 44 నాటౌట్, శ్రీకాంత్ రెడ్డి 30 నాటౌట్).
జాన్సన్ గ్రామర్ స్కూల్ 152 (సన్నీ లఖాని 56, గౌతమ్ 30); ఓబుల్ రెడ్డి హెచ్‌ఎస్ 108 (సాకేత్ 44 నాటౌట్, రాహుల్ 35, నిఖిల్ 3/13, సన్నీ లఖాని 3/33).
డీఏవీ పబ్లిక్ స్కూల్ 64 (సమీ 4/15, విప్లవ్ 3/17); హెచ్‌పీఎస్ బేగంపేట్ 69/4 (కృష్ణ 31 నాటౌట్).
ఆల్‌సెయింట్స్ 153 (అంకుశ్ 3/25, శ్రీనాథ్ 3/26); లయోలా అకాడమీ జేసీ 90 (శ్రీనాథ్ 39, హితేశ్ యాదవ్ 3/32).
సెయింట్ జాన్స్ చర్చ్ జేసీ 265/7 (శిరీష్ గౌడ్ 79, భగత్ 70, నిఖిల్ పర్వాణి 44, అజయ్ 3/41); జూబ్లీహిల్స్ హెచ్‌ఎస్ 101 (సాయితేజ 46).
సెయింట్ మేరీస్ జేసీ బషీర్‌బాగ్ 290/9 (అక్షయ్ కుమార్ 72, రుత్విక్ 67, దుర్గేశ్ 57, నిఖిల్ కుమార్ 3/41); గురుకుల్ విద్యాపీఠ్ 167 (ఆశ్రీత్ 32, షాబాజుద్దీన్ 4/25, అజయ్ కుమార్ 3/32).
యష్, రేవంత్ సెంచరీలు
Published Tue, Aug 20 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement