మతిస్థిమితం లేని మహిళ కిడ్నీ కాజేసిన దుండగులు
తిరువొత్తియూరు(చెన్నై): మానవత్వం మంటగలిసింది. మతిస్థిమితంలేని మహిళ కిడ్నీని కాజేసిన దారుణం తమిళనాడులోని శివగంగైలో సంచలనం కలిగించింది. వివరాలు.. తమిళనాడు శివగంగై సమీపంలోని తామరాక్కి నార్త్ వీధికి చెందిన మహిళ కోవై సెల్వి(30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వాసుతో వివాహమైంది. వీరికి మణికంఠన్(12) అనే కుమారుడు ఉన్నాడు. సెల్వి నాలుగేళ్లుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది.
వాసు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. మణికంఠన్ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. 25 రోజుల క్రితం సెల్వి అదృశ్యమైంది. శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన ఒకరు స్థానిక బస్టాండ్‌లో సెల్విని చూశాడు. ఆమె ఇంటికే తీసుకొచ్చి వదిలిపెట్టాడు. కాసేపటికి సెల్వికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల ఆమెకు ఒక కిడ్నీ తొలగించినట్టు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మంటగలిసిన మానవత్వం
Published Mon, Sep 19 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement