kidney stolen
-
పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవడంతో అక్కడి వారు దొడ్డిదారిలో సంపాదన కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు. పాకిస్తాన్లో ఓ అనామక డాక్టర్ గుట్టుగా నిర్వహిస్తోన్న మానవ అవయవాల స్మగ్లింగ్ గుట్టును రట్టు చేశారు పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ బయటపెట్టారు. మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. డాక్టర్ ఫవాద్ ఇప్పటివరకు మొత్తం 328 సర్జరీలు నిర్వహించారని వీటి ద్వారా సుమారుగా 35000 యూఎస్ డాలర్లు( రూ.28.27 లక్షలు) కొల్లగొట్టారునై అన్నారు. ఈ ముఠాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒక కారు మెకానిక్ పేషేంట్లకు అనస్థీషియా ఇవ్వడంలో సహకరించేవాడని వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరిన పేషేంట్లను లాహోర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ గుట్టుగా ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేనందున అక్కడ వీరు యథేచ్ఛగా సర్జరీలు చేసేవారని అన్నారు. ఈ ముఠా నిర్వహించిన సర్జరీల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని, మిగిలిన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. నిందితుడు డాక్టర్ ఫవాద్ ఇదే కేసులో గతంలో ఐదు సార్లు అరెస్టయ్యారని కానీ న్యాయపరమైన లొసుగులను అడ్డంపెట్టుకుని బయటకు వచ్చేవారని అన్నారు. ఆశ్చర్యకరంగా సర్జరీలు జరిగిన చాలామందికి తమ కిడ్నీని తొలగించిన విషయం కూడా తెలియదు. ఈ ముఠాసభ్యుల్లో ఒకరు తనవద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ కోసం బలవంత పెట్టారని.. ఇప్పుడు వేరొక డాక్టర్ వద్దకు వెళ్తే తనకు ఒక కిడ్నీలేదని చెప్పారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్ -
ఆస్పత్రి నిర్వాకం; కిడ్నీ చోరీ కలకలం!?
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేటలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ రోగి కడుపులో ఉన్న గడ్డతో పాటు కిడ్నీ తొలగించడంతో కలకలం రేగింది. వివరాలు.... హయత్‌నగర్‌కు చెందిన శివ ప్రసాద్(29) అనే వ్యక్తి కడుపులో గడ్డ ఉందని వారం రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో అతడి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ఆస్పత్రి వర్గాలు నిన్న(సోమవారం) గడ్డను తొలగించామని పేర్కొన్నాయి. అయితే గడ్డతో పాటు శివ ప్రసాద్ కిడ్నీ కూడా తొలగించామంటూ మంగళవారం వైద్యులు చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో ఎవరికీ చెప్పకుండా అసలు ఇలా ఎందుకు చేశారంటూ శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. శివ ప్రసాద్ కిడ్నీ చోరీ చేశారంటూ నిరసన చేపట్టారు. కాగా శివ ప్రసాద్ శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినందు వల్లే కిడ్నీ తొలగించామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రక్తదానం రమ్మన్నాడు.. కిడ్నీ కొట్టేశాడు
అన్నానగర్ : రక్తదానం కోసమని బంధువైన యువకుడిని తీసుకెళ్లాడు. అతడికి తెలియకుండానే కిడ్నీని అపహరించి తన కుమారుడికి అమర్చుకున్నాడు. యువకుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కిడ్నీ అపహరణ విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుని తల్లి జిల్లా ఎస్పీ మణివన్నన్కి సోమవారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. మదురై జిల్లా ఒత్తకడైకి చెందిన షకీలా కుమారుడు మహ్మద్ ఫక్రుద్ధీన్ (18) ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మదురై సమీపం కొట్టాంపట్టికి చెందిన సమీప బంధువు రాజా మహమ్మద్ 2017 అక్టోబర్‌లో భషీర్ అహ్మద్ అనే వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చాడు. తన కుమారుడు అజారుద్ధీన్కి రక్తందానం చేయాలని కోరి ఫక్రీద్దీన్ను ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. ఫక్రుద్దీన్ రక్తంలో క్రిములు ఉన్నాయి, చికిత్స చేయాల్సి ఉందని నమ్మబలికి ఒక కాగితంపై సంతకం తీసుకెళ్లాడు. ఫక్రుద్దీన్‌ను నెలరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి ఇంటికి వచ్చిన మహ్మద్ ఫక్రుద్ధీన్ నడవలేక నీరసించి పోయాడు. అనుమానంతో పరీక్షలు చేయించగా ఫక్రుద్ధీన్ కిడ్నీ అపహరణకు గురైనట్లు తెలుసుకున్నారు. రక్తదానం కోసమని చెప్పి కుమారుడిని తీసుకెళ్లిన బంధువు రాజా మహ్మద్, సదరు ప్రయివేటు ఆసుపత్రి నిర్వాహకులను ప్రశ్నించగా బెదిరించారు. కిడ్నీ అపహరణ, బెదిరింపులపై గురించి మేలూరు పోలీసుస్టేషన్లో గత ఏడాది ఆఖరులో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తన బంధువు రాజమహ్మద్ పోలీసులు అండగా నిలుస్తున్నందున నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని షకీలా తన ఫిర్యాదులో ఎస్పీని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును విచారించి తగిన చర్యలు తీసుకోవాలని మేలూర్ డీఎస్పీని ఆదేశించినట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఇప్పటికీ న్యాయం జరగకుంటే హైకోర్టును ఆశ్రయిస్తానని బాధితురాలు మీడియా తెలిపారు. -
మంటగలిసిన మానవత్వం
మతిస్థిమితం లేని మహిళ కిడ్నీ కాజేసిన దుండగులు తిరువొత్తియూరు(చెన్నై): మానవత్వం మంటగలిసింది. మతిస్థిమితంలేని మహిళ కిడ్నీని కాజేసిన దారుణం తమిళనాడులోని శివగంగైలో సంచలనం కలిగించింది. వివరాలు.. తమిళనాడు శివగంగై సమీపంలోని తామరాక్కి నార్త్ వీధికి చెందిన మహిళ కోవై సెల్వి(30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వాసుతో వివాహమైంది. వీరికి మణికంఠన్(12) అనే కుమారుడు ఉన్నాడు. సెల్వి నాలుగేళ్లుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. వాసు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. మణికంఠన్ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. 25 రోజుల క్రితం సెల్వి అదృశ్యమైంది. శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన ఒకరు స్థానిక బస్టాండ్‌లో సెల్విని చూశాడు. ఆమె ఇంటికే తీసుకొచ్చి వదిలిపెట్టాడు. కాసేపటికి సెల్వికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల ఆమెకు ఒక కిడ్నీ తొలగించినట్టు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.