ఆర్‌అండ్‌బీ భవనంలో కలెక్టరేట్? | r&b office as a wanaparthy collectorate | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ భవనంలో కలెక్టరేట్?

Published Wed, Oct 5 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

ఆర్‌అండ్‌బీ భవనంలో కలెక్టరేట్?

ఆర్‌అండ్‌బీ భవనంలో కలెక్టరేట్?

  భవనం స్వాధీనం చేయాలని కలెక్టర్ ఆదేశం
  ఖరారు కాని వనపర్తి కలెక్టరేట్ భవనం
 
 ఆర్‌అండ్‌బీ కార్యాలయం, కలెక్టరేట్, వనపర్తి
 
వనపర్తి : జిల్లాల ఏర్పాటు ముహూర్తం సమీపిస్తున్నా.. వనపర్తిలో కలెక్టరేట్ కోసం నేటకీ భవనం ఖరారు కాలేదు. ఎస్పీ, తదితర ప్ర భుత్వ శాఖల కార్యాల యాల ఏర్పాటుకు భవనాలు ఎంపిక చేసుకున్నారు. కలెక్టరేట్ విషయంలో కలెక్టర్ శ్రీదేవి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఇటీవల ఆమె వనపర్తిలో పర్యటించి రాజమహల్ (పాలిటెక్నిక్ కళాశాల), మిషన్‌కంపౌండ్ తదితర భవనాలు పరిశీలించారు. రాజమహల్ ఎంపిక విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు సానుకూలమైన అభిప్రాయం వెల్లడించలేదని తెలుస్తోంది. దీం తో కలెక్టర్ ఆదే శం మేరకు స్థా నిక రెవెన్యూ అధికారులు ఇ తర భవనాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక జిల్లా అదనపు కోర్టు సమీపంలోని ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయం భవనాన్ని కలెక్టర్ కార్యాలయం కోసం ప్రతిపాదించారు. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉందని భావించిన కలెక్టర్ భవనాన్ని తమ కు స్వాధీనం చే యాలని ఈ నె ల ఒకటవ తే దీన ఆదేశాలి చ్చారు. మరో రెండుమూడు రోజుల్లో ప్రస్తు తం ఆర్‌అండ్‌బీ డివిజన్ ఆఫీస్ భవనాన్ని కలెక్టర్‌కు అప్పగించనున్నారు. ఈ భవనానికి రంగులు వేసి కలెక్టరేట్‌గా మార్చే ఆవకాశాలున్నాయి. ఆర్డీఓ రామచందర్‌ను వివరణ కోరగా.. ఈ భవనాన్ని ప్రతిపాదించామని కలెక్టర్ ఆదేశాలిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. 
 
నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడుతున్న సందర్భంగా నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయానికి సం బంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, టీ ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో కల్టెక్టర్ ఛాంబర్, సిబ్బందికి సంబంధించి ఛాంబర్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఎవరి సెక్షన్లను ఎక్కడ ఏర్పాట్లు చేసేది, దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. దసరా వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాససూరి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement