లోకకల్యాణం కోసం పాటుపడండి | Assembly Speaker S madhusudanachari saya that lok kalyanam | Sakshi
Sakshi News home page

లోకకల్యాణం కోసం పాటుపడండి

Published Thu, Feb 25 2016 5:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

లోకకల్యాణం కోసం పాటుపడండి

లోకకల్యాణం కోసం పాటుపడండి

సభాపతి
 మధుసూదనాచారి
మక్తమాదారంలో మహాలక్ష్మి
అమ్మవారిని
దర్శించుకున్న స్పీకర్

 
 
తలకొండపల్లి: సమాజానికి ఉపయోగప డే కార్యక్రమాలు చేపట్టి లోకకల్యాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని మక్తమాధారం వేణుగోపాలస్వామి ఆలయంలో బోయనిపల్లి సంపత్‌కుమా ర్, కవిత దంపతుల సహకారంతో నిర్వహించిన మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అ మ్మవారికి స్పీకర్ ప్రత్యేకపూజలు చేశారు. ఆలయవిశిష్టతను తెలుసుకున్నారు. నిర్వాహకులు, పూజారులు సభాపతికి పూర్ణకుంభ హారతితో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భక్తితోనే ముక్తి, మోక్షం లభిస్తుందన్నారు.

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికమార్గంలో పయనిస్తే భవిష్యత్ సుఖమయంగా ఉంటుందన్నారు. మానవసేవయే మాధవసేవ..అని ప్రతి మనిషి తోటివారికి సహాయపడాలని స్పీకర్ పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించిన సంపత్‌కుమార్ చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి రావడం మహానందంగా ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించిన సంపత్‌కుమార్ దంపతులను స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి స్పీకర్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నర్సింహ, వేదపండితులు రామానుజాచారి, ఆదిత్యావర్దన్, చక్రవర్తి, బాలురాజ్, చెన్నయ్య, కృష్ణం రాజు, జనార్దన్‌రెడ్డి  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement