16 ఏళ్ల తరువాత కన్నవారి చెంతకు..
నల్లగొండజిల్లా (చౌటుప్పల్) మతి స్థిమితం కోల్పోయి 16 ఏళ్లుగా రోడ్లు మీద తిరుగుతున్న ఓ యువకుడికి చికిత్స చేయించి, మామూలు మనిషిగా మారిన తరువాత కన్నవారి చెంతకు చేర్చింది ఓ అనాధశ్రమం. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ఓడీసీ మండలం బుచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గంగాధర్(30) మతిస్థిమితం కోల్పోయి పదహారేళ్ల క్రితం ఇంటి నుంచి బయటికెళ్లాడు. ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి కొత్త పేట రోడ్ల వెంట తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో ‘అమ్మానాన్న’ అనాథాశ్రమ నిర్వాహకులకు కంటపడ్డాడు. అతణ్ని చేరదీసి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చిక్సి చేయించారు. అతను మామూలు మనిషికాగానే తన వాళ్లుగురించి వివరాలు, చిరునామా చెప్పాడు.ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. విషయం తెలిసిన వారు ఆశ్రమ నిర్వాహకులను కలిశారు. ఆశ్రమ నిర్వాహాకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతణ్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాలా కాలం వెతికాం, ఇక తిరిగిరాడని మరిచిపోయామని, పదహారేళ్ల తరువాత దొరకడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు.