ఒకే చోట అన్ని ప్రత్యక్ష ప్రసారాలు
సౌండ్ సిస్టమ్‌లో లోపాలతో మీడియాకు ఇబ్బందులు
హైదరాబాద్: అడుగడుగునా అవాంతరాలు.. ధ్వని ప్రసార వ్యవస్థలో లోపాలు.. ఒకే చోట అన్ని ప్రత్యక్ష ప్రసారాలు.. మెట్రోపొలిస్ సదస్సు మూడో రోజు కూడా ఇదేతీరు. ప్రధాన వేదికలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాలను హైటెక్స్‌లోని ఒక హాల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీడియాకు అందించినా.. సౌండ్ సిస్టమ్ దెబ్బతినడం, అడగడుగునా అంతరాయాలు కలగడం మీడియాకు ఇబ్బంది కలిగించింది. మీడియా కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సదస్సు కార్యక్రమాల వీక్షణకు హాజరవుతున్న మీడియా వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
బుధవారం ఉదయం మంత్రి కె. తారకరామారావు పాల్గొన్న సమావేశంలోనూ ఆడియో వ్యవస్థ మొరాయించడం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానిని సరిదిద్దాలని కోరడం వంటివి జరిగాయి. సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ఏర్పాటు చేసినచర్చలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఈఎంఆర్‌ఐ. తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొనగా.. కార్యక్రమం మొదట్లో సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిలిచిపోయింది.
మూడో రోజూ అదే తీరు!
Published Thu, Oct 9 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement