హైఓల్టేజీ.. హైరానా! | Haiolteji .. busy! | Sakshi
Sakshi News home page

హైఓల్టేజీ.. హైరానా!

Published Tue, Jan 13 2015 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

హైఓల్టేజీ.. హైరానా!

హైఓల్టేజీ.. హైరానా!

ఆమనగల్లు: హైఓల్టేజీ విద్యుత్ సరఫరా హైరానా సృష్టించింది. పట్టణ బీసీ కాలనీలోని పలు ఇళ్లలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఎక్కువ తీవ్రత ఉన్న విద్యుత్ సరఫరా కావడంతో టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. ఓ ఇంట్లో టీవీ పేలి పెద్దఎత్తున పొగలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. స్థానిక పట్టణంలోని బీసీ కాలనీలోని శ్రీనివాస టాకీస్ సమీపంలో ఉన్న ఇళ్లకు మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా అయింది.

అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా హై ఓల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో సమీపంలో ఉన్న సుమారు 20 ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఇదే కాలనీకి చెందిన జనుంపల్లి నర్సింహా ఇంట్లో టీవీ పేలిపోయి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇరుగుపొరుగు వారు తాళాలు విరగ్గొట్టి ఇంట్లో ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను బయటికి తీసుకొచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
Advertisement