కొత్తగూడెం: కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ వ్యక్తి భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లి తండాలో ఆదివారం రాత్రి జరిగింది. బానోతు చందు, ఉషల మధ్య ఆదివారం రాత్రి విభేదాలు తలెత్తాయి.
దీంతో చందు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఉషకు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
భార్యపై కిరోసిన్ పొసి నిప్పంటించిన కిరాతకుడు
Published Sun, Mar 1 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement