కళాత్మకం.. సబ్బండనాదం
♦ వివిధ వస్తువులతో సంగీత పరికరం రూపకల్పన
♦ జనచైతన్య కళా సంస్థ ప్రతినిధుల ఘనత
జిన్నారం: కళాకారులు వినూత్నంగా ఆలోచించారు. నిత్యం వినియోగంలో ఉండే వివిధ రకాల వస్తువులను ఉపయోగించి ఓ సంగీత పరికరాన్ని రూపొందించారు. దీనికి ‘సబ్బండనాదం’గా నామకరణం చేశారు. డీజే సౌండ్ సిస్టం వంటి పరికరాలను పక్కనపెట్టి వీటితో కూడా సంగీతాన్ని అందించవచ్చని ఈ కళాకారులు నిరూపించారు.
మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన జన చైతన్య కళా సంస్థ కళాకారులు నిత్యం వాడుకలో ఉండే డప్పు, గడ్డపార, ఇనుప గంప, తాపీ, పారా, బిందె, కంజెరలను ఉపయోగించి సంగీత పరికరాన్ని తయారు చేశారు. ఆదివారం ఈ పరికరాన్ని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సురభి నాగేందర్‌గౌడ్ ఆవిష్కరించారు. ప్రస్తుత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో నిత్యం రాత్రి సమయంలో ఈ సంగీత పరికరంతోనే వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేయిస్తామని జనచైతన్య కళా సంస్థ డెరైక్టర్ ఎల్లయ్య తెలిపారు.