♦ పంటలకు రుణ పరిమితులను
♦ ఖరారు చేసిన ఎస్‌ఎల్‌టీసీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే వ్యవసాయ సీజన్‌కు స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్(రుణ కొలబద్ద) ఖరారైంది. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి బ్యాంకులు ఇవ్వాల్సిన ఏకీకృత రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) నిర్ణయించింది. 2016-17లో సాగునీటి వనరులున్నచోట వరికి ఎకరానికి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. 2015-16లో వరికి రుణ పరిమితి రూ.25 వేల నుంచి రూ. 28 వేల వరకు ఉంది.
ఆహారధాన్యాలు, ఉద్యాన, నూనెగింజల పంటలకు సంబంధించి మొత్తం 70 పంటలకు ఎస్‌ఎల్‌టీసీ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది. అత్యధికంగా చెరకు, పసుపు పంటలకు రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు, ద్రాక్ష పంటకు రూ.80 వేల నుంచి రూ. 85 వేల వరకు రుణ పరిమితిని నిర్ణయించారు. అత్యంత తక్కువగా సజ్జ, రాగి పంటలకు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు నిర్ణయించారు. ఉల్లికి ఎకరానికి రూ.18 వేల నుంచి రూ.22 వేలుగా నిర్ధారించారు. టిష్యూ కల్చర్‌లో పండించే అరటికి రూ.75 వేల నుంచి రూ.80 వేలుగా నిర్ణయించారు. జామ తోటలు వేసే రైతులకు రూ.18 వేల నుంచి రూ.22 వేలు, సపోటకు రూ.18 వేల నుంచి రూ. 20 వేలుగా నిర్ధారించారు.