రబట్: అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది.
114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ కోసం ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించనున్నామని సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒసామా ఈల్-హుస్సేనీ వెల్లడించారు. దక్షిణ కాసాబ్లాంకాలోని బౌస్కౌరా నగరంలో 250 హెక్టార్లలో మోడరన్ సిటీ నిర్మించనున్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్ కుటుంబం
Published Wed, Dec 3 2014 9:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement