గూగుల్ ఫోన్‌తో లైవ్ 3డీ మ్యాప్ | Google reveals handset with built in 3D scanner | Sakshi
Sakshi News home page

గూగుల్ ఫోన్‌తో లైవ్ 3డీ మ్యాప్

Published Tue, Feb 25 2014 8:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

గూగుల్ ఫోన్‌తో లైవ్ 3డీ మ్యాప్

గూగుల్ ఫోన్‌తో లైవ్ 3డీ మ్యాప్

వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో అరుదైన గాడ్జెట్‌కు రూపకల్పన చేసింది. లైవ్‌లో 3డీ మ్యాప్‌ను చిత్రించేందుకు వీలున్న సరికొత్త మొబైల్ ఫోన్‌ను గూగుల్ రూపొందించింది. గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ యూనిట్ వివిధ ఇన్‌స్టిట్యూట్‌ల సహాయంతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాలను మొబైల్ ద్వారా షూట్ చేసి దానిని 3డీ మ్యాప్‌గా మార్పు చేయవచ్చు. ఇందుకుగానూ మొబైల్‌లోనే నావిగేషన్ కోసం అత్యాధునిక స్కానర్‌ను పొందుపరిచారు.


ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ రూపాల్లో వాడుకోవచ్చని, ఎక్కువగా ప్రచారం పొందని భవనాలు, ప్రదేశాలను గుర్తించేందుకు, అంధులకు సహాయపడేందుకు, ఇండోర్ గేమింగ్‌లో మరింత లీనమయ్యేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో పనిచేసే ఈ ఐదంగుళాల మొబైల్‌లో 3డీ మోషన్‌లో వీడియోను రికార్డ్ చేసేందుకు అనువుగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. ఫోన్‌లోని సెన్సార్లు ఒక సెకనులో రెండున్నర లక్షల 3డీ మెజర్‌మెంట్స్‌ను అందుకుని, ఏకకాలంలో ఆ లొకేషన్‌ను 3డీ మ్యాప్‌గా మార్చేస్తాయి.

Advertisement

పోల్

Advertisement