హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని గెలీలి బేసిన్ గనుల నుంచి బొగ్గు రవాణాకు సంబంధించి స్థానిక ఆరిజోన్ సంస్థతో జీవీకే హ్యాంకాక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా రైలు మార్గంతో పాటు అబాట్ పాయింట్ పోర్టులో బొగ్గు టెర్మినల్‌ను నిర్మించనున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్‌కి మార్గం సుగమమైనట్లు జీవీకే హాంకాక్ పేర్కొంది. ప్రాజెక్టు సాకారమయ్యే దిశగా గణనీయమైన పురోగతి సాధించగలిగినట్లు జీవీకే చైర్మన్ జీవీ కృష్ణా రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా క్వీన్స్‌లాండ్‌లో సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగలవని, నిర్మాణ దశలో 1,300 ఉద్యోగాలు, పూర్తయ్యాక దీర్ఘకాలిక ప్రాతిపదికన 300 ఉద్యోగాలు రాగలవని అంచనా.
ఆరిజోన్, జీవీకే హ్యాంకాక్ ఒప్పందం
Published Tue, Nov 26 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement