హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా | Shocking video shows high school girl assaulting male student | Sakshi
Sakshi News home page

హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా

Published Sun, Nov 6 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా

హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా

మొబైల్ ఫోన్ రింగ్ టోన్ విషయంలో తలెత్తిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. నచ్చని రింగ్ టోన్ పదేపదే వినాల్సిరావడంతో చిర్రెత్తుకొచ్చిన ఓ అమ్మాయి తన క్లాస్ మేట్ ను చితకబాదింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేన్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక స్కూల్లో చిత్రీకరించినట్లుగా భావిస్తోన్న వీడియోలో హైస్కూల్ విద్యార్థిని సహ విద్యార్థిని ఉతికిపారేసింది. 'రేయ్.. ఆ రింగ్ టోన్ ఆపుతావా లేదా..'అని ఆ అమ్మాయి మొదట సున్నితంగా మందలించడం, కొద్ది సెకన్లకే మళ్లీ అతని దగ్గరికెళ్లి చెడామడా వాయించడం జరిగింది. 'అమ్మాయి మూడు సార్లు కొడితే.. నువ్వూ కొట్టొచ్చు'అని అబ్బాయిని సమర్థిస్తూ ఇంకొకరు మాట్లాడిన మాటలూ వీడియోలో వినిపిస్తాయి. ఎన్ని దెబ్బలు కొట్టినా 'నా రింగ్ టోన్ నా ఇష్టం..' అనే మాట తప్ప ఎదురుతిరగని ఆ అబ్బాయి.. చివరికి పక్కన కూచ్చున్న మరో అమ్మాయి కలగజేసుకోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతకీ వివాదానికి కారణమైన రింగ్ టోన్ ఏ పాట? అనేది మాత్రం తెలియరాలేదు!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement