high school girl
-
టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు..
స్కూళ్లకు వెళ్లే పిల్లలు బుద్ధిగా ఓ చోట కూర్చోమంటే ఎందుకు ఉంటారండి! చిరుతిళ్లు తింటూ టీచర్‌కి దొరికి పోవడమో, పెన్సిల్ దొంగతనం చేయడమో, క్లాస్ ఎగ్గొట్టడమో, పరీక్షలు బాగా రాయకపోవడమో.. ఒకటేమిటి అన్నీ చేస్తారు! ఆనక టీచర్ ఇచ్చే పనిష్మెంట్లు తీసుకోవడం.. ఇంట్లో టీచర్‌పై పిర్యాదులు చేయడం ఇది మామూలే! ప్రతి స్కూల్లో జరిగేదే. ఐతే చైనాలో ఒక టీచర్ ఇచ్చిన పనిష్మెంట్కు ఓ విద్యార్ధిని శాశ్వతంగా అంగవైకల్యురాలైంది. అసలేంజరిగిందంటే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన హై స్కూళ్లో చదివే 14 యేళ్ల విద్యార్ధిని వసతి గృహంలో తన బెడ్ పక్కన ఉన్న స్నాక్స్ గురించి టీచర్ ప్రశ్నించిందట. ఐతే బాలిక తనవి కావని బుకాయించిందట. దీంతో ఆగ్రహించిన టీచర్ 300 గుంజిళ్లు తీయమని పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన టీచర్‌కి బాలిక సక్రమంగా గుంజిళ్లు తీస్తుందో లేదో పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐతే గతంలొనే బాలిక కాలి గాయంతో బాధపడుతుందన్న విషయం తెలిసినా ఎవ్వరూ శిక్షను రద్దు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో 150 గుంజిళ్లు తీశాక, బాలిక పరిస్థితి విషమించడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఇక మీదట మామూలుగా నడవలేదని, ఊత కర్రల సాయంతోనే నడవవల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో తీవ్ర షాక్‌కు గురైన బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన గురించి తెలిసిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా బాలికకు రూ. 13 లక్షలు నష్టపరిషారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. ఐతే బాలిక తల్లిదండ్రులు దానిని నిరాకరించారట. ఇది గత యేడాది జూన్ 10న జరిగినట్లు బాలిక తల్లి జోవూ స్థానిక మీడియాకు తెల్పింది. తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు.. -
నీకు జగన్ మామయ్య ఉన్నాడని అమ్మ చెప్పింది
సాక్షి, అమరావతి: ‘మా అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడు తోంది. ఇలాంటి కష్టకాలంలో నేను మా అమ్మను మీరిచ్చే పింఛన్‌తో చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నీకు మామయ్య (జగన్) ఉన్నాడని మా అమ్మ నాకు చెపుతుందని కృష్ణాజిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రమ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతమైంది. దీంతో చలించిన ముఖ్యమంత్రి.. బాలిక తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యా రంగంపై జరిగిన మేధోమథన సదస్సుకు వచ్చిన రమ్య ఏం మాట్లాడిందంటే.. ► సీఐడీ ఆఫీసర్ కావాలన్నది నా కల. దాన్ని చేరుకోలేనేమోనని భయపడేదాన్ని. ► మామయ్యలా మాకు అండగా ఉంటానన్న మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. మా నాన్నగారు లేరు. అమ్మ కూలి పనిచేసుకుని నన్ను చదివించేది. ► మీరిచ్చిన ‘అమ్మఒడి’ డబ్బులు వచ్చాయి. నాలాంటి పేదవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ► అమ్మ ప్రేమ ముద్ద మా జగనన్న గోరుముద్ద. ► ఇలాంటి ఫుడ్ పక్కవాళ్లు తింటుంటే.. పెళ్లిళ్లలో చూశాం. కానీ, మేం ఇప్పుడు తింటున్నాం. ► వియ్ ఆర్ లక్కీ సార్. ఐ యామ్ ప్రౌడ్ టు బి లివింగ్ ఇన్ ఏపీ అండర్ యువర్ రూల్ సార్. ► కంటివెలుగు ద్వారా మా స్కూల్లో కంటి పరీక్షలు చేయించుకున్నాం. ► నాడు–నేడు ద్వారా నాడు పాఠశాల వేదనను చూశాం.. నేడు జగనన్న పాలనలో హరివిల్లును చూస్తున్నాం. బాత్రూంలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది.. అని రమ్య తన ప్రసంగం ముగించింది. అనంతరం జోక్యం చేసుకున్న సీఎం జగన్.. రమ్య తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు అడిగి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా
మొబైల్ ఫోన్ రింగ్ టోన్ విషయంలో తలెత్తిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. నచ్చని రింగ్ టోన్ పదేపదే వినాల్సిరావడంతో చిర్రెత్తుకొచ్చిన ఓ అమ్మాయి తన క్లాస్ మేట్ ను చితకబాదింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేన్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక స్కూల్లో చిత్రీకరించినట్లుగా భావిస్తోన్న వీడియోలో హైస్కూల్ విద్యార్థిని సహ విద్యార్థిని ఉతికిపారేసింది. 'రేయ్.. ఆ రింగ్ టోన్ ఆపుతావా లేదా..'అని ఆ అమ్మాయి మొదట సున్నితంగా మందలించడం, కొద్ది సెకన్లకే మళ్లీ అతని దగ్గరికెళ్లి చెడామడా వాయించడం జరిగింది. 'అమ్మాయి మూడు సార్లు కొడితే.. నువ్వూ కొట్టొచ్చు'అని అబ్బాయిని సమర్థిస్తూ ఇంకొకరు మాట్లాడిన మాటలూ వీడియోలో వినిపిస్తాయి. ఎన్ని దెబ్బలు కొట్టినా 'నా రింగ్ టోన్ నా ఇష్టం..' అనే మాట తప్ప ఎదురుతిరగని ఆ అబ్బాయి.. చివరికి పక్కన కూచ్చున్న మరో అమ్మాయి కలగజేసుకోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతకీ వివాదానికి కారణమైన రింగ్ టోన్ ఏ పాట? అనేది మాత్రం తెలియరాలేదు! -
హైస్కూల్ అమ్మాయి: షాకింగ్ వీడియా