అక్టోబర్ 4 నుంచి అంతరిక్ష వారోత్సవాలు | spacecraft week to be started from october 4 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 4 నుంచి అంతరిక్ష వారోత్సవాలు

Published Sat, Sep 19 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

spacecraft week to be started from october 4

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో అక్టోబర్ 4 నుంచి 10 వరకు అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించనున్నామని గ్రూప్ డైరెక్టర్, పీఅండ్ పీఆర్‌ఓ పరుచూరి విజయసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2015-16 విద్యాసంవత్సరంలో సెంట్రల్ సిలబస్ పదోతరగతిలో జిల్లాస్థాయి టాపర్లకు అంతరిక్ష ప్రయోగాలపై పరీక్షలు నిర్వహించి జీఎస్‌ఎల్‌వీ అవార్డులను అందజేస్తామని చెప్పారు.
 
 అంతరిక్ష కార్యక్రమాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు ఈసారి తిరుపతి, విజయవాడలాంటి నగరాల్లో జిల్లా సైన్స్ సహకారంతో వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్, క్విజ్‌లు నిర్వహించి విజేతలకు షార్ తరఫున బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు. షార్ కేంద్రం సందర్శించాలనుకున్న వారు 30లోపు ఞఞౌఃటజ్చిట.జౌఠి.జీ అనే అడ్రస్‌కు నమోదు చేసుకోవాలని కోరారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 10న స్థానిక హోలీక్రాస్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు ‘అంతరిక్ష నడక’ను కూడా నిర్వహించ తలపెట్టామని చెప్పారు.

Advertisement
Advertisement