ఆస్కార్‌ వేడుకల్లో విశాఖ వజ్రాభరణాలు | Visakha diamonds Jewelery in Oscar celebrations | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ వేడుకల్లో విశాఖ వజ్రాభరణాలు

Published Mon, Mar 5 2018 12:50 AM | Last Updated on Mon, Mar 5 2018 12:50 AM

Visakha diamonds Jewelery in Oscar celebrations - Sakshi

విశాఖ సిటీ: అమెరికాలో జరిగే 90వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్స వాల్లో విశాఖపట్నానికి చెందిన రెండు జ్యువెలరీ దుకాణాల నుంచి వజ్రాభరణాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. విశాఖ లోని వైభవ్‌ జ్యువెలరీస్, పీఎంజే జ్యువెలరీస్‌ సేకరించిన అరుదైన అందమైన ఫరెవర్‌ మార్క్‌ వజ్రాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రెడ్‌ కార్పెట్‌ కలెక్షన్లను ఎంపిక చేశారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆభరణాల్ని ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. దేశీయ ప్రతిభను అంతర్జాతీయ వేడుకల్లో ఆవిష్కరిస్తామని జ్యువెలరీస్‌ సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement